Markapuram: త్రిపురాంతకం సీఐగా మాతంగి శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ!

Markapuram: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా మాతంగి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎర్రగొండపాలెం ఎస్సైగా పనిచేసిన అనుభవం ఉంది.

Srikanth Singam, Markapur
Published on: 11 Oct 2026 10:23 PM IST
Markapuram
X

Markapuram: త్రిపురాంతకం సీఐగా మాతంగి శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ!

మార్కాపురం: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా మాతంగి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు త్రిపురాంతకం సీఐగా విధులు నిర్వహిస్తున్న హసన్ వి.ఆర్. పంపించారు.

మాతంగి శ్రీనివాసరావుకు గతంలో ఎర్రగొండపాలెం పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై)గా పనిచేసిన అనుభవం ఉంది. ఆ సమయంలో తన విధి నిర్వహణ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఆయన సుపరిచితులయ్యారు. స్థానిక పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రాంతంలోని శాంతిభద్రతల అంశాలపై ఆయనకు అవగాహన ఉండటం విశేషం.

ఎర్రగొండపాలెం ప్రాంతంలో గతంలో పనిచేసిన అనుభవం ఉన్న శ్రీనివాసరావు త్రిపురాంతకం సీఐగా బాధ్యతలు చేపట్టడంతో స్థానిక ప్రజల్లో ఆయన నియామకంపై ఆసక్తి నెలకొంది. పోలీస్‌ శాఖలో తనకున్న అనుభవంతో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

త్రిపురాంతకం సర్కిల్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో సీఐగా ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur