Chimakurthy: చీమకుర్తిలో కూటమి భారీ ర్యాలీ: శిద్దా సుధాకర్

Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి శిద్దా సుధాకర్, కౌన్సిలర్ల విజయం కోసం ఎమ్మెల్యే విజయ్ కుమార్, శిద్దా రాఘవరావు భారీ ర్యాలీ చేపట్టారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 30 Oct 2026 8:28 PM IST
Chimakurthy
X

Chimakurthy: చీమకుర్తిలో కూటమి భారీ ర్యాలీ: శిద్దా సుధాకర్

చీమకుర్తి: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శిద్దా సుధాకర్‌తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన 26 మంది కౌన్సిలర్ అభ్యర్థులు, జనసేన పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

చీమకుర్తిలోని ఎన్ఎస్పీ కాలనీ నుంచి హరిహర క్షేత్రం వరకు ర్యాలీ సాగింది. చైర్మన్ అభ్యర్థి శిద్దా సుధాకర్‌తో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ బలాన్ని చాటారు. ర్యాలీ మార్గంలో అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని, చీమకుర్తి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.

ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, శిద్దా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారు కూటమి అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొని నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

వీరితో పాటు మండల స్థాయి టీడీపీ, జనసేన నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి నాయకులు అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. భారీ ర్యాలీతో చీమకుర్తిలో ఎన్నికల సందడి నెలకొంది.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam