Markapuram: మార్కాపురం జెడ్పీ ఛైర్మన్ రేసులో తీవ్ర పోటీ!
Markapuram: మార్కాపురం జెడ్పీ ఛైర్మన్ ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ; కందుల రామిరెడ్డి, డాక్టర్ మన్నే రవీంద్ర కోసం ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టిన అధిష్ఠానం.
Markapuram: మార్కాపురం జెడ్పీ ఛైర్మన్ రేసులో తీవ్ర పోటీ!
Markapuram: మార్కాపురం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని దక్కించుకునే నాయకులు ఎవరనే అంశంపై టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. జడ్పీ ఛైర్మన్ అభ్యర్థులుగా మార్కాపురం ప్రాంతానికి చెందిన నియోజకవర్గ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
వీరిద్దరి పేర్లను పరిశీలనలో ఉంచినట్లు ప్రచారం జరుగుతుండగా, అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ (IVRS) కాల్స్ నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈరోజు మధ్యాహ్నం నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రారంభంవడంతో స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థుల ఎంపిక ఐవీఆర్ఎస్ సర్వే ఆధారంగా జరుగుతుందని ప్రచారం.
మొత్తానికి మార్కాపురం జడ్పీ ఛైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుంది? కందుల రామిరెడ్డికా.. డాక్టర్ మన్నే రవీంద్రకా? అన్నది టీడీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చగా మారింది.




