Markapuram: గిద్దలూరు బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు ట్రంకు పెట్టెల పంపిణీ!

Markapuram: మార్కాపురం జిల్లా గిద్దలూరు బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు ట్రంకు పెట్టెల పంపిణీ. టీడీపీ పట్టణ అధ్యక్షులు షానేషావలి భాగస్వామ్యం.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 11 Nov 2026 12:51 PM IST
Markapuram
X

Markapuram: గిద్దలూరు బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు ట్రంకు పెట్టెల పంపిణీ!

Markapuram: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కోటగడ్డ స్ట్రీట్‌లో ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు ట్రంకు పెట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు, కౌన్సిలర్ షానేషావలి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థిని ఉన్నత చదువులు చదివి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ వార్డెన్ పార్వతీ భాయ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU