Markapuram: 444 మంది పోలింగ్ అధికారులకు శిక్షణ – కలెక్టర్ సునీత!
Markapuram: మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా 444 మంది పోలింగ్ సిబ్బందికి శిక్షణ. నిబంధనల ప్రకారం నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశం.
Markapuram: 444 మంది పోలింగ్ అధికారులకు శిక్షణ – కలెక్టర్ సునీత!
మార్కాపురం: మార్కాపురం మున్సిపాలిటీ రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో 444 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులకు కంభం రోడ్డులోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో శిక్షణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ నిష్పాక్షికంగా, అప్రమత్తంగా విధులు నిర్వహించి పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
ఈవీఎంల వినియోగం, మాక్ పోల్, ఎన్నికల ఫారాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పాల్గొన్నారు.




