Markapuram: భూ కబ్జాదారులు, గంజాయి ముఠాలకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!

Markapuram: మార్కాపురంలో భూ కబ్జాదారులు, గంజాయి బ్యాచ్‌పై నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్. మహిళా భద్రత, ట్రాఫిక్‌కు ప్రాధాన్యత; సోషల్ మీడియాపై హెచ్చరిక.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 24 Sept 2026 2:13 PM IST
Markapuram
X

Markapuram: భూ కబ్జాదారులు, గంజాయి ముఠాలకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!

మార్కాపురం: మార్కాపురం జిల్లాలో భూ కబ్జాలు, గంజాయి అక్రమ రవాణా, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ తెలిపారు. గురువారం మార్కాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అనంతరం పోలీసు అధికారులతో సమావేశమై జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రధానమైన భూ వివాదాల పరిష్కారం, మహిళల భద్రత, ట్రాఫిక్ సమస్యల నియంత్రణతో పాటు క్రైమ్ నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడతామని తెలిపారు.

వాట్సాప్, సోషల్ మీడియాలో నిర్ధారణ లేని, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలకు సూచించారు. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని ఎస్పీ పంకజ్ కుమార్ కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM