Podili: ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ విజయ సునీత!
Podili: మార్కాపురం జిల్లా పొదిలి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Podili: ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ విజయ సునీత!
పొదిలి: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), ఇతర సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, పోలింగ్ అధికారులు (పీఓలు), ఎన్నికల అధికారులు (ఈఓ) తదితరులు పాల్గొన్నారు.




