Markapuram: పెద్దారవీడు ఎస్సై రోజులను గుర్తుచేసుకున్న డీఎస్పీ సత్యనారాయణ

Markapuram: మార్కాపురం నూతన డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణను పెద్దారవీడు టీడీపీ నేతలు సత్కరించారు; గతంలో ఎస్సైగా పనిచేసిన రోజులను డీఎస్పీ గుర్తుచేసుకున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Updated on: 4 Oct 2026 9:42 PM IST
Markapuram
X

Markapuram: పెద్దారవీడు ఎస్సై రోజులను గుర్తుచేసుకున్న డీఎస్పీ సత్యనారాయణ

Markapuram: మార్కాపురం నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నిమ్మగడ్డ సత్యనారాయణను పెద్దారవీడు మండల టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి అభినందించారు.

గతంలో పెద్దారవీడు ఎస్సైగా నిమ్మగడ్డ సత్యనారాయణ పనిచేసిన నేపథ్యంలో ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారవీడు మండలంలోని కుంట, దేవరాజుగట్టు, గొబ్బూరు ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు హైవేలపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఎస్పీని నాయకులు కోరారు.

మార్కాపురం డివిజన్ పరిధిలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడుతూ, ప్రజలకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండల టీడీపీ మాజీ అధ్యక్షులు గొట్టం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జడ్డ రవి, మాజీ సర్పంచులు ఇండ్ల రామకృష్ణారెడ్డి, అకుమల్ల శ్రీనివాస్‌రెడ్డి, గంగుల చిన్న ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ వెన్న వెంకట్‌రెడ్డి, నియోజకవర్గ బీసీ నాయకులు మూఢమంతు కొండ గురవయ్య, జిల్లా తెలుగు యువత కార్యదర్శి తిరుమలరెడ్డి చిన్న వెంకటరెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM