Markapuram: మార్కాపురం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ కనకదుర్గ!

Markapuram: మార్కాపురం మున్సిపల్ చైర్మన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Updated on: 18 Oct 2026 1:31 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ కనకదుర్గ!

మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆమె.. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కనకదుర్గ మాట్లాడుతూ.. గతంలో 2014, 2021 ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం తనకు ఉందన్నారు. శ్రావణి ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నానని తెలిపారు. ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమని, వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం ఆశీస్సులతో మరోసారి ఎన్నికల బరిలోకి దిగినట్లు పేర్కొన్నారు.

మార్కాపురం పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి చైర్మన్‌గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, జంకె వెంకట్‌రెడ్డి, కె.పి. కొండారెడ్డి, మైనార్టీ నాయకులు షంషేర్ అలీ బిగ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, వెన్న హనుమాన్ రెడ్డి, ఉడుముడుల కోటిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సలీం తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM