Yerragondapalem: మార్కాపురంలో రేపు కూటమి ఆత్మీయ సమావేశం
Yerragondapalem: యర్రగొండపాలెం నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై రేపు మార్కాపురం వైష్ణవి గార్డెన్స్‌లో కూటమి నేతల ఆత్మీయ సమావేశం జరగనుంది.
Yerragondapalem: మార్కాపురంలో రేపు కూటమి ఆత్మీయ సమావేశం
మార్కాపురం జిల్లా: యర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే ధ్యేయంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ నెల *21వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మార్కాపురంలోని వైష్ణవి గార్డెన్స్‌లో* ఈ సమావేశం జరగనుంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, భవిష్యత్ కార్యాచరణ, కూటమి విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశానికి డాక్టర్ మన్నే రవీంద్ర మాజీ చైర్మన్–ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్, మాజీ వైస్ చైర్మన్–ప్రకాశం జిల్లా పరిషత్ ఆహ్వానం పలికారు.




