Markapuram: మార్కండేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు పూజలు!

Markapuram: మార్కాపురం జిల్లాలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానాన్ని ఎమ్మెల్సీ బీటీ నాయుడు, దోర్నాల జెడ్పీటీసీ కందుల రామిరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 16 Nov 2026 11:41 AM IST
Markapuram
X

Markapuram: మార్కండేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు పూజలు!

మార్కాపురం: శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానాన్ని ఎమ్మెల్సీ బీటీ నాయుడు, దోర్నాల జెడ్పీటీసీ కందుల రామిరెడ్డి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యం, ప్రత్యేకతలను ఆలయ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లికార్జున శర్మ, కమిటీ సభ్యులు యలమంద, బొందిలి శివసింగ్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM