Markapuram: మార్కాపురం జడ్పీ చైర్మన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కోటపాటి సుధాకర్‌రెడ్డి!
Markapuram: మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోటపాటి సుధాకర్‌రెడ్డికి బీ-ఫారం అందజేత. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు నివాసంలో కార్యక్రమం.
Markapuram: మార్కాపురం జడ్పీ చైర్మన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కోటపాటి సుధాకర్‌రెడ్డి!
Markapuram: మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటపాటి సుధాకర్‌రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీ-ఫారం అందజేశారు. మార్కాపురం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు స్వగృహంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కొనకనమిట్ల మండల జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేస్తున్న కోటపాటి సుధాకర్‌రెడ్డికి అన్నా రాంబాబు పార్టీ తరఫున బీ-ఫారం అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ఆయన బరిలో నిలుస్తుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




