Markapuram: పెద్ద దోర్నాలలో గుమ్మా ఎల్లయ్య ఎన్నికల ప్రచార జోరు

Markapuram: పెద్ద దోర్నాల మేజర్ పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి గుమ్మా ఎల్లయ్య శ్రీశైలం బస్టాండ్ ప్రాంతంలో ప్రచారం; మౌలిక వసతుల కల్పనకు హామీ.

Srikanth Singam, Markapur
Published on: 24 Nov 2026 7:05 PM IST
Markapuram
X

Markapuram: పెద్ద దోర్నాలలో గుమ్మా ఎల్లయ్య ఎన్నికల ప్రచార జోరు

మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గుమ్మా ఎల్లయ్య ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక శ్రీశైలం బస్టాండ్ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గుమ్మా ఎల్లయ్య ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ప్రధానంగా నెలకొన్న కోతుల బెడద, తాగునీటి సమస్య, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామంలోని ప్రతి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ గంట వెంకటరమణారెడ్డి, రసూల్, జిలాని, కొండెపోగు చిన్నబాబు, ఎలకపాటి పెద్ద లక్ష్మయ్యతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur