Giddalur: గిద్దలూరులో ఘనంగా ఖురాన్ కంఠస్థ ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీలు!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని షాదిఖానా ఫంక్షన్ హాల్‌లో ఆదివారం బాలబాలికలకు పవిత్ర ఖురాన్ కంఠస్థ ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీలు ఘనంగా నిర్వహించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 15 Nov 2026 5:58 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో ఘనంగా ఖురాన్ కంఠస్థ ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీలు!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా, గిద్దలూరు యునైటెడ్ ఫోరం ఫర్ ఖు రానిక్ స్టడీస్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు గిద్దలూరు పట్టణంలోని షాదిఖానా ఫంక్షన్ హాల్ నందు సున్నా నుండి 12 సంవత్సరముల లోపు బాల బాలికలకు పవిత్ర ఖుురాన్ కంఠస్థ పోటీల ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీలను నిర్వహించటం జరిగినది.. ఇందులో సుమారు 80 మంది బాలబాలికలు కంఠస్థం చేయబడిన ఖురాన్ ఆయతులను , వాటి అనువాదాన్ని పఠించడం జరిగినది.

ఇందులో నుంచి ప్రతిభ కనబర్చిన 10 మంది విజేతలను ఎన్నుకోవడం జరిగింది,వీరిని రాష్ట్రస్థాయి క్వార్టర్ ఫైనల్ కొరకు మార్కాపురం పంపడం జరుగుతుంది,అందులో విజేతలు గా నిలిచే వారిని సెమీఫైనల్ కొరకు నెల్లూరుకు పంపడం జరుగుతుంది, ఫైనల్ పోటీలు విజయవాడలో జరుగుతాయి. ఫైనల్ విజేతలకు ప్రథమ బహుమతి 20,000, రూ రెండో బహుమతి 15,000, రూ మూడో బహుమతి 10,000, వేల రూపాయలు పోటీలో పాల్గొన్న మిగతా వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేయబడతాయి.

ఈరోజు జరిగిన పోటీ విజేతలకి సర్టిఫికెట్ తో పాటు బహుమతులు అందజేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో పట్టణంలోని అన్ని మసీదుల ఇమాములు, మస్జిద్ కమిటీ అధ్యక్షులు పాల్గొని విజేతలను అభినందించడం జరిగింది... మౌలానా అబ్దుల్ రషీద్, మౌలానా అబ్దుల్ హక్, ముఫ్తీ ముహమ్మద్ అలీ, మౌలానా జమాలుద్దీన్ ,హజరత్ రఫీ, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం లో పట్టణ ప్రముఖులు అక్బర్ అలీ,

అప్సర్ భాష, దాదా పీరా, ఆదమ్ ఖాన్, కాంట్రాక్టర్ ఖాదర్ వలీ, గుడిసె మహబూబ్ బాషా, పెద్ద వలి తదితరులు పాల్గొని విజేతలను అభినందించి, బహుమతి ప్రదానం చేశారు.... జమాఅతే ఇస్లామీ హింద్ గిద్దలూరు అధ్యక్షులు ఫాజిల్ మహమ్మద్ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో sio నాయకులు నాయబ్ రసూల్, ఫయాజ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.. పెద్ద సంఖ్యలో పిల్లల తల్లి తల్లిదండ్రులు పాల్గొని అభినందనలు తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU