Giddalur: ధరల నియంత్రణే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ముత్తుముల!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు, కొమరోలు ప్రాంతాల్లో తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించి బియ్యం పంపిణీ చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 19 Nov 2026 10:40 AM IST
Giddalur
X

Giddalur: ధరల నియంత్రణే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ముత్తుముల!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లో ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రతీ ఆధార్ కార్డు పై 26 kg ల బ్యాగ్ పంపిణీ చేయనున్నారు ఇందులో భాగంగా నిర్ణిత ధరలపై KNM - 50 / BPT- 49 రూపాయల తక్కువ ధరకు సన్నబియ్యం అందించేందుకు గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డు లోని HDFC BANK ఎదురుగా మరియు కొమరోలు బస్ స్టాండ్ వద్ద కిరాణా షాపులనందు ఎంపిక చేయగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంబించారు, అనంతరం పలువురకి స్వయంగా ఎమ్మెల్యే బియ్యం నాణ్యతను పరీక్షించి ప్రజలకు అందించారు,

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఇప్పటికే రైతు బజార్లలో మరియు పట్టణాలలో ఇతర ప్రత్యేక కౌంటర్ల ద్వారా బీపీటీ రకం సన్నబియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తున్నాం.

ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదనంగా కేఎన్ఎం / ఆర్ఎన్ఆర్ రకం సన్నబియ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం అని బియ్యం ధరల వివరాలు బీపీటీ సన్నబియ్యం – కిలో రూ.49, కేఎన్ఎం / ఆర్ఎన్ఆర్ సన్నబియ్యం – కిలో రూ. 50లకు 26 కిలోల బ్యాగుల రూపంలో అందజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో అన్ని రేషన్ దుకాణాలలో అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అని తెలిపారు.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం ధరల నియంత్రణ చర్యలు తీసుకుంటుంది. ఎప్పటిక అప్పుడు బహిరంగ మార్కెట్ ధరలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ చేస్తున్నారని ప్రజలకు మేలు చేసే విధంగా ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.

రాష్ట్ర ప్రజలు ఎక్కువగా కోరుకునే బీపీటీ, నెల్లూరు సన్నబియ్యం రకాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో మరియు ఇతర పట్టణాలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యాన్ని ప్రజలకు కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్ లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU