Markapuram: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి: జేసీ!
Markapuram: మార్కాపురం జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు బియ్యం వ్యాపారులు, రైస్ మిల్లుల యజమానులను ఆదేశించారు.
Markapuram: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి: జేసీ!
మార్కాపురం: మార్కాపురం జిల్లాలో బియ్యం ధరల నియంత్రణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు బియ్యం వ్యాపారులు, రైస్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, ప్రతి దుకాణం, రైస్ మిల్లు వద్ద ధరల పట్టికలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కిలో బియ్యం ధరలు:
BPT సోనా, సాంబా, KNM – రూ.66
HMT, RNR – రూ.76
జై శ్రీరామ్ – రూ.82
MTU రకాలు – రూ.47
నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయిస్తే సంబంధిత వ్యాపారులు, మిల్లుల యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి అంకయ్యతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




