Markapuram: పొదిలి జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి మద్దుల శ్రీనివాసులు విజయం!

Markapuram: మార్కాపురం జిల్లా పొదిలి జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి మద్దుల శ్రీనివాసులు 13,481 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు.

MADARVALI, MARKAPURAM
Published on: 7 Nov 2026 8:44 PM IST
Markapuram
X

Markapuram: పొదిలి జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి మద్దుల శ్రీనివాసులు విజయం!

మార్కాపురం: మార్కాపురం జిల్లా పొదిలి మండల జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి మద్దుల శ్రీనివాసులు ఘన విజయం సాధించారు. జరిగిన జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో జనసేన పార్టీ అభ్యర్థి మద్దుల శ్రీనివాసులు తన సమీప ప్రత్యర్థిపై 13,481 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల మద్దతుతో ముందుకు సాగిన మద్దుల శ్రీనివాసులు ఓట్ల లెక్కింపులో భారీ ఆధిక్యతను కనబరిచి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు.

ఈ విజయంతో జనసేన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. విజయం ఖరారైన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) చేతుల మీదుగా మద్దుల శ్రీనివాసులు డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు. భారీ మెజారిటీతో తనను గెలిపించిన పొదిలి మండల ప్రజలకు మద్దుల శ్రీనివాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM