Markapuram: రైతుల ఆదాయం పెంచేందుకు బహుళ పంటల సాగు: విజయ సునీత!
Markapuram: మార్కాపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన పంటల సాగుతో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టం చేశారు.
Markapuram: రైతుల ఆదాయం పెంచేందుకు బహుళ పంటల సాగు: విజయ సునీత!
మార్కాపురం: మార్కాపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితులను అధిగమించి రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.
రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి. విజయ్ కుమార్ కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో సమావేశమై వ్యవసాయాభివృద్ధి, సాగునీటి సౌకర్యాలు, రైతుల సమస్యలపై చర్చించారు.
ఏకపంట సాగుకు బదులుగా అంతర పంటలు, బహుళ పంటల సాగును ప్రోత్సహించాలని, నిరుపయోగ భూములను సాగులోకి తీసుకురావాలని సూచించారు. రసాయన రహిత ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పాల్గొన్నారు.




