Giddalur: గిద్దలూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం!

Giddalur: గిద్దలూరు మండలం రంగారెడ్డిపల్లె క్రాస్ రోడ్డు సమీపంలోని అమరావతి జాతీయ రహదారిపై రోడ్డుపై ఉన్న ఇటుకపై బైక్ ఎక్కి అదుపుతప్పిన ప్రమాదంలో లలితమ్మ అనే మహిళ మృతి చెందింది.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 19 Nov 2026 3:21 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం రంగారెడ్డిపల్లె క్రాస్ రోడ్డు సమీపంలోని అమరావతి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లలితమ్మ అనే మహిళ మృతి చెందింది. కొమరోలు మండలం అలసందల పల్లె గ్రామానికి చెందిన లలితమ్మ సమీప బంధువు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి గిద్దలూరుకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది.

ఈ క్రమంలో రంగారెడ్డిపల్లె క్రాస్ రోడ్డు సమీపానికి చేరుకోగానే రోడ్డుపై అడ్డంగా ఉన్న ఇటుకపై ద్విచక్ర వాహనం ఎక్కి అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో లలితమ్మ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU