Giddalur: ఎన్నికల విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: రమణబాబు!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన అధికారులు, పోలీసు, పోలింగ్ సిబ్బంది, ప్రజలు, మీడియాకు కమిషనర్ రమణబాబు కృతజ్ఞతలు తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 18 Nov 2026 3:55 PM IST
Giddalur
X

Giddalur: ఎన్నికల విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: రమణబాబు!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది, ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు, మీడియా ప్రతినిధులకు మున్సిపల్ కమిషనర్ రమణబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ అనేది ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదని, వందలాది మంది సిబ్బంది సమష్టి కృషి, అధికారుల సమన్వయం, పోలీసుల భద్రత, రాజకీయ పార్టీల సహకారం, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ విజయవంతమవుతుందని పేర్కొన్నారు.

గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులు, 30,652 మంది ఓటర్లు, 41 పోలింగ్ స్టేషన్లు, 13 పోలింగ్ లొకేషన్లు, 31.94 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్నికల నిర్వహణ ఒక ప్రత్యేక బాధ్యతగా నిలిచిందన్నారు.

సుమారు 250 మంది పోలీసు సిబ్బంది, 257 మంది పోలింగ్ సిబ్బంది, 32 మంది అధికారులు విధులు నిర్వర్తించగా, 16 వాహనాలు, 6 బస్సుల ద్వారా రవాణా ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణ కోసం రెండు జోన్లు, ఐదు రూట్లుగా విభజించి, 100 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని, కౌంటింగ్ ప్రక్రియ కోసం 61 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.

ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు, ఎండనకా, వాననకా విధులు నిర్వహించిన పోలింగ్ సిబ్బంది, రవాణా సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగుల సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

అలాగే ఎన్నికల ప్రక్రియలో ప్రతి కీలక ఘట్టాన్ని ప్రజలకు చేరవేస్తూ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

వృత్తిపరమైన జీవితంలో ప్రత్యేక మైలురాయి

గిద్దలూరు మున్సిపల్ కమిషనర్‌గా, ఎన్నికల నిర్వహణ అధికారిగా ఈ బాధ్యతలను నిర్వర్తించడం తన వృత్తిపరమైన జీవితంలో ప్రత్యేక అనుభవంగా నిలిచిపోతుందని రమణబాబు తెలిపారు. ప్రతి దశలో మార్గనిర్దేశం చేసి సహకరించిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

చివరిగా ఈ విజయవంతమైన ఎన్నికల నిర్వహణలో తనకు అండగా నిలిచిన అధికారులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, రాజకీయ నాయకులు, ప్రజలు, జర్నలిస్టులందరికీ మరోసారి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

పదవులు మారవచ్చు.. బాధ్యతలు మారవచ్చు.. కానీ సమష్టిగా సాధించిన విజయాలు, అందించిన సహకారం, పంచుకున్న అనుభవాలు ఎప్పటికీ మధురస్మృతులుగా మిగిలిపోతాయని రమణబాబు పేర్కొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU