Giddalur: వైసీపీని వీడి ఎమ్మెల్యే ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిక!

Giddalur: మార్కాపురం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 18 Nov 2026 3:52 PM IST
Giddalur
X

Giddalur: వైసీపీని వీడి ఎమ్మెల్యే ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిక!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు బిజ్జం వెంకటరామిరెడ్డి, బిజ్జం రవీంద్రనాథ్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మారే శ్రీనివాసులు సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాజీ వైస్ సర్పంచ్ మునగాల వెంకటరెడ్డి, యల్లంపల్లి రామిరెడ్డి, జింకల రామాంజనేయరెడ్డి, ఎద్దుల తిరుపాల్ రెడ్డితో పాటు వారి అనుచరులు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచి, వారి విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా వారికి సూచించారు. కార్యక్రమంలో దద్దవాడ పంచాయతీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU