Markapuram: వెలిగొండ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్!

Markapuram: మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించి, అర్హులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలని కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 13 Nov 2026 4:03 PM IST
Markapuram
X

Markapuram: వెలిగొండ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్!

మార్కాపురం: మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను పూర్తి స్థాయిలో సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు.

కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఫేజ్-1, ఫేజ్-2 భూసేకరణ పెండింగ్ పనులు, పునరావాస కాలనీల్లో మిగిలిన పనులపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, జలవనరుల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM