Markapuram: అర్థవీడు జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆంజనేయులు ఘన విజయం!
Markapuram: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి బండ్లమూడి ఆంజనేయులు 12,963 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
Markapuram: అర్థవీడు జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆంజనేయులు ఘన విజయం!
మార్కాపురం: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బండ్ల మూడి ఆంజనేయులు టీడీపీ 12963 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన మండల ప్రజలకు, పార్టీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నాపై నమ్మకముంచి నన్ను జడ్పీటీసీ గా నిలబెట్టి గెలిపించిన శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపారు. నియోజక వర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గమనించి నాకు ఓటు వేసి నా విజయానికి దోహద పడ్డారని ఆయన అన్నారు.




