Konakanamitla: కొనకనమిట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు
Konakanamitla: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. చెత్తాచెదారంగా మారిన వైద్యశాల, సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.
Konakanamitla: కొనకనమిట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు
కొనకనమిట్ల: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండల కేంద్ర ప్రభుత్వవైద్యాశాల దుస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం కొట్ల రూపాయలు వెచ్చించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సంకల్ప దీక్షతో పనిచేస్తుంటే అధికారులు, సిబ్బంది దానికి విరుద్ధంగా పనిచేస్తున్నరన్న సంగతి స్పష్టం అవుతుంది.
పేదలకు ఉపయెగించాల్సిన సెలైన్ బాటిళ్లు నిర్లక్ష్యంగా పడేశారు, రొగులకు అందించే వాడిని సిరెంజ్లు చెత్తకుప్పలో పడేస్తున్నారు. ఉన్నతాధికారుల అధికారుల తనిఖి లు నామా మాత్రంకావడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న ఆరొపణలున్నాయి.
ప్రభుత్వ వైద్యశాల రొగులు పరిమిత సంఖ్యలో ఉంటే ఆర్ ఎంపిల దగ్గర క్యూలు కడుతున్నారు, దినిని బట్టే అర్దం అవుతుంది సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంరన్న సంగతి. పేరుకు ఇద్దరు వైద్యులున్న ఒక వైద్యుడే దిక్కున్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం వద్ద నుంచి వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటు తు..తు మంత్రంగా పనిచేస్తున్న సిబ్బంది పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకొవాలని స్థానికులు కొరుతున్నారు. ప్రధాన రహదారిపై ఉండే వైద్యశాలను వివిధ పనులపై వెళ్ళే జిల్లాకలెక్టర్ ,వైద్యశాఖ ఉన్నతాధికారులు ఒక్కసారి కుడా పరిశీలించక పొవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు సందర్శించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది పై క్రమశిక్షణ చర్యలు తీసుకొవాలని కొరుతున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే అధికారుల ఆకస్మిక తనిఖీలు చేయాలని కొరుతున్నారు.




