Giddalur: అక్టోబర్ 7న మార్కాపురంలో సీపీఎం బహిరంగ సభ
Giddalur: మార్కాపురం జిల్లా అభివృద్ధికి ₹10,000 కోట్లు కేటాయించాలని కోరుతూ అక్టోబర్ 7న జరిగే సీపీఎం ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
Giddalur: అక్టోబర్ 7న మార్కాపురంలో సీపీఎం బహిరంగ సభ
మార్కాపురం జిల్లా, గిద్దలూరు: ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయం లో ఈనెల ఏడో తారీఖున మార్కాపురంలో జరుగుతున్న ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బహిరంగ సభ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం నాయకులు టి ఆవులయ్య మాట్లాడుతూ జిల్లా ఏర్పడి 10 నెలలు అవుతున్న జిల్లా అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని అన్నారు.
ఇప్పటికీ అన్ని శాఖలకు సంబంధించిన పూర్తి స్థాయి అధికారులను కేటాయించలేదని అన్నారు.
మార్కాపురం జిల్లా అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించి చిన్న, మధ్యతరః పరిశ్రమలను అభివృద్ధి చేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న వనరులను అభివృద్ధి చేయాలని అన్నారు.
గిద్దలూరు నియోజకవర్గంలో లెదర్ ఫ్యాక్టరీ ప్రారంభించి ఉపాధి కల్పించాలని అన్నారు. వెనుకబడ్డ మార్కాపురం జిల్లా అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే వెలిగొండ రెండవ దశ పనులు ప్రారంభించాలని అన్నారు.
జిల్లా అభివృద్ధిపై ఈనెల ఏడో తేదీన ర్యాలీ బహిరంగ సభ జరుగుతుందని ఈ ర్యాలీ బహిరంగ సభలో ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.
ఈ కరపత్ర ఆవిష్కరణలో సిపిఎం పార్టీ నాయకులు బి నర్సింహులు, డి థామస్, డి శ్రీనివాసులు పాల్గొన్నారు.




