Markapuram: మార్కాపురంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలని అధికారులకు ఆదేశం.
Markapuram: మార్కాపురంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన 11వ పోలింగ్ బూత్‌ను సందర్శించి పోలింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి.వి.ఎస్. నారాయణరావు, ఎమ్మార్వో చిరంజీవి, పలువురు అధికారులు పాల్గొన్నారు.




