Veligonda: వెలిగొండ పునరావాస కాలనీల్లో కలెక్టర్ విజయ సునీత పర్యటన
Veligonda: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలైన ఇడుపూరు, వేములకోట లేఅవుట్లను కలెక్టర్ విజయ సునీత, జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు.
Veligonda: వెలిగొండ పునరావాస కాలనీల్లో కలెక్టర్ విజయ సునీత పర్యటన
మార్కాపురం జిల్లా, వెలిగొండ: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలైన ఇడుపూరు–1, ఇడుపూరు–2, వేములకోట లేఅవుట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి , టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టు సిబ్బంది, రెవెన్యూ అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా లేఅవుట్లలో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి, ఇంకా మిగిలి ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి, పునరావాస కాలనీలను సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ విజయ సునీత సూచించారు.




