Markapur: వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన.. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన!

Markapur: మార్కాపురంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేసిన పార్టీ నేతలు. ఉద్రిక్తత.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Nov 2026 2:44 PM IST
Markapur
X

Markapur: వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన.. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన!

Markapur: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నేతలు మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

వైఎస్సార్‌సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా వెంకట రాంబాబు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గతో పాటు పలువురు పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. షేక్ సలీం అరెస్టుపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నేలపై కూర్చొని నిరసన తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో మార్కాపురం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM