Dornala: దోర్నాల మండలం బొమ్మలాపురం వద్ద ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి
Dornala: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురంలో పెద్దపులి సంచారం, ట్రాప్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు.
Dornala: దోర్నాల మండలం బొమ్మలాపురం వద్ద ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి
దోర్నాల: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలో ఉన్న ఊరకొండ వద్దకు అడవి నుండి వచ్చి సంచరిస్తున్న పెద్ద పులి ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కింది.
ఈ పెద్ద పులి అడవి ని వదిలి వచ్చి ఆవుల మందలపై దాడి చేసి చంపుతుండటంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయించారు.
మూడు రోజుల క్రితం ఇదే పులి శివారెడ్డి అనే వ్యక్తికి చెందిన రెండు ఆవులను దాడి చేసి చంపేసింది.మరొ రెండు ఆవులను గాయపరిచింది.
పెద్ద పులి ట్రాప్ కెమెరాలకు చిక్కిన విషయం తెలుసుకున్న రైతులు పశువుల కాపరులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి దాడిలో చనిపోయిన ఆవుల యజమానికి నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిసిన ఫారెస్ట్ రేంజర్ సుబ్బారావు, ఊరకొండ వైపు పులి సంచారం నేపథ్యంలో అటువైపు పశువుల కాపరులు రైతులు వెళ్ళ వద్దని హెచ్చరించారు.




