Markapuram: మార్కాపురంలో ఆధార్ కేంద్రంపై తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ!

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆధార్ సేవలకు అధిక వసూళ్లు చేస్తున్న కేంద్రంపై హెచ్ఎంటీవీ కథనంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి హెచ్చరించిన తహసీల్దార్ చిరంజీవి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 Oct 2026 1:12 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో ఆధార్ కేంద్రంపై తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ!

Markapuram: మార్కాపురం పట్టణంలో ఆధార్ దందాపై హెచ్ఎంటీవీ వెబ్ న్యూస్‌లో వచ్చిన కథనంపై తహసీల్దార్ కె. చిరంజీవి స్పందించారు. కంభం రోడ్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఉన్న ఆధార్ కేంద్రానికి కామన్‌మ్యాన్‌గా వెళ్లి సేవల రుసుములపై స్వయంగా ఆరా తీశారు.

బయోమెట్రిక్‌కు నిర్ణీత రూ.120కు బదులుగా రూ.200, ఫోన్ నంబర్ మార్పునకు రూ.75కు బదులుగా రూ.150 వసూలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి స్టేట్‌మెంట్లను నమోదు చేశారు.

ప్రభుత్వం నిర్ణయించిన రుసుములకే సేవలు అందించాలని ఆదేశించిన తహసీల్దార్.. అధిక వసూళ్లు నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో డిటి శ్రీనివాసులు,ఆర్ఐ అరుణ,వీఆర్వోలు వెంగల్ రెడ్డి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM