Markapur: వీధి కుక్కల బెడద.. మార్కాపురంలో ప్రజల ఆందోళన

Markapur: మార్కాపురంలోని భగత్‌సింగ్, పూలసుబ్బయ్య కాలనీల్లో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.

SREENIVAS YANNAM, MARKAPURAM
Updated on: 12 Oct 2026 3:58 PM IST
Markapur
X

Markapur: వీధి కుక్కల బెడద.. మార్కాపురంలో ప్రజల ఆందోళన

మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని పలు వీధుల్లో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భగత్‌సింగ్ కాలనీ, పూలసుబ్బయ్య కాలనీల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తుండటంతో ప్రమాదాల భయం నెలకొంది.

ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి, ప్రజల ఇబ్బందులను గుర్తించి వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM