Markapur: మార్కాపురం డీఎస్పీ నాగరాజుకు ఎస్పీ పంకజ్ కుమార్ వీడ్కోలు!

Markapur: ప్రకాశం మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు 37 ఏళ్ల సేవలు పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ పొందగా, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆయనను సన్మానించి వీడ్కోలు పలికారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Oct 2026 11:38 AM IST
Markapur
X

Markapur: మార్కాపురం డీఎస్పీ నాగరాజుకు ఎస్పీ పంకజ్ కుమార్ వీడ్కోలు!

Markapur: పోలీసు శాఖలో 37 ఏళ్ల సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజును జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి పట్ల నిబద్ధత, అంకితభావంతో పోలీసు శాఖకు అందించిన నాగరాజు సేవలు మరువలేనివన్నారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. క్లిష్టమైన కేసులను మనోధైర్యం, నాయకత్వ నైపుణ్యంతో పరిష్కరించారని కొనియాడారు.

ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఎస్పీ ఆకాంక్షించారు. రిటైర్మెంట్ తర్వాత కూడా పోలీసు కుటుంబంలో సభ్యుడిగానే ఉంటారని, అవసరమైనప్పుడు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా ఐపీఎస్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM