Markapur: మార్కాపురంలో పేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ

Markapur: మార్కాపురం 21వ వార్డులో రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ. పాల్గొన్న కౌన్సిలర్ మర్రి ఝాన్సీ రాణి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 4 Nov 2026 7:27 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో పేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ

మార్కాపూర్: రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని 21వ వార్డులో పేద కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 21వ వార్డు కౌన్సిలర్ మర్రి ఝాన్సీ రాణి అధ్యక్షతన, మరాసు సునీత ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేసి, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన సేవ అనే సందేశాన్ని చాటారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

“సేవే మా లక్ష్యం.. మానవత్వమే మా మార్గం” అనే నినాదంతో రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM