Markapur: కృష్ణా-అర్జునులుగా ఎమ్మెల్యే కందుల, వక్కలగడ్డ!
Markapur: మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వక్కలగడ్డ మల్లికార్జున్ ఫొటోలు వైరల్. మున్సిపల్ చైర్మన్ రేసుపై మార్కాపురంలో జోరుగా రాజకీయ చర్చ.
Markapur: కృష్ణా-అర్జునులుగా ఎమ్మెల్యే కందుల, వక్కలగడ్డ!
మార్కాపూర్: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే కందులను కృష్ణుడిగా, వక్కలగడ్డను అర్జునుడిగా పోలుస్తూ కూటమి కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
మరోవైపు, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వక్కలగడ్డ మల్లికార్జున్ పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, వైసీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కూటమి అభ్యర్థిగా వక్కలగడ్డ పేరు ప్రచారంలో ఉండగా, వైసీపీ నుంచి ఎవరిని బరిలోకి దింపుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.




