Markapur: మార్కాపురంలో పోలీసుల భారీ ర్యాలీ: డ్రగ్స్ నిర్మూలనకు పిలుపు
Markapur: మార్కాపురంలో డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల రక్షణపై ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Markapur: మార్కాపురంలో పోలీసుల భారీ ర్యాలీ: డ్రగ్స్ నిర్మూలనకు పిలుపు
మార్కాపురం జిల్లా: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, మహిళల భద్రతపై ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువతలో చైతన్యం కల్పించేందుకు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు.
మార్కాపురం OSD నవజ్యోతి మిశ్రా, IPS, డి.ఎస్.పి నిమ్మగడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొననున్నారు.
మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగుతుంది. డ్రగ్స్‌కు దూరంగా ఉండటం, రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారూ.




