Dornala: దోర్నాలలో ఘనంగా జాతీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమం
Dornala: మార్కాపురం జిల్లా దోర్నాలలో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
Dornala: దోర్నాలలో ఘనంగా జాతీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమం
దోర్నాల: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం అయినముక్కల మూడవ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ అధికారుల సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ నాయకురాలు రోహిణి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు తొలి దశ నుంచే సమతుల్య పోషకాహారం అందించడం అవసరమని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు కూడా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని అవగాహన కల్పించారు. పోషకాహార లోపంతో తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చిన్నారుల బరువు, ఎదుగుదలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి అవసరమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పోషకాహారం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు మహానంది సుజాత, టి. పద్మావతి, వై. నాగమల్లేశ్వరి, జెడ్. లక్ష్మమ్మ, ఎం. లక్ష్మీకుమారి, సీహెచ్. విజయ, కే. పద్మావతి, ఎస్.కె. రేష్మ, ఆయాలు, గర్భిణులు, బాలింతలు, మహిళలు, చిన్నారులు, ఇతర లబ్ధిదారులు పాల్గొన్నారు.




