Markapur: మార్కాపురంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Markapur: మార్కాపురంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఇమ్మడి కాశీనాథ్. పాల్గొన్న కూటమి నాయకులు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 28 Sept 2026 11:13 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మార్కాపురం: పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో అడుగు పడింది. మార్కాపురం పట్టణంలోని 21, 22, 23, 24 వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన పార్టీ మార్కాపురం జిల్లా నాయకులు ఇమ్మడి కాశీనాథ్ శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

పట్టణంలోని వార్డుల్లో రహదారి సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన ఈ పనులతో స్థానిక ప్రజలకు ప్రయోజనం కలగనుంది. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు, స్థానికంగా రహదారుల సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వక్కగడ్డ మల్లికార్జున, మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థాన పాలక మండలి సభ్యులు విజయరావు నరసింహారావు, మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పిన్నెబోయిన లక్ష్మీరాజ్యం, పూజా లక్ష్మీ పాల్గొన్నారు.

అలాగే జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, ఉమ్మడి రవీంద్ర, ఎన్.వి. సురేష్, టీడీపీ నాయకులు గఫార్, నాలి కొండయ్య, మర్రి కొండలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM