Markapur: తౌషిక్ మరణంపై హత్య కేసు నమోదు చేయాలి

Markapur: తౌషిక్ మరణంపై హత్య కేసు నమోదు చేసి పాఠశాలను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఒంగోలులో ఈ నెల 12న మహా ధర్నా నిర్వహించనున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 9 Oct 2026 5:53 PM IST
Markapur
X

Markapur: తౌషిక్ మరణంపై హత్య కేసు నమోదు చేయాలి

మార్కాపురం: తౌషిక్ మరణంపై హత్య కేసు నమోదు చేసి, సంబంధిత పాఠశాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

మార్కాపురంలోని ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తౌషిక్ మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.

ఈ నెల 12న ఒంగోలులో 50 వేల మందితో నిర్వహించనున్న మహా ధర్నాకు కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, సీపీఐ నాయకుడు ఎం.ఎల్. నారాయణ, సీపీఎం నాయకుడు రఫీ, కేవీపీఎస్‌ నాయకుడు రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సుదర్శన్ రావు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM