Markapur: తొలి జడ్పీ చైర్మన్ రేసులో కందుల రామిరెడ్డి పేరు హల్చల్
Markapur: మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ పీఠంపై రాజకీయ వర్గాల్లో చర్చ. టీడీపీ సీనియర్ నేత కందుల రామిరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం.
Markapur: తొలి జడ్పీ చైర్మన్ రేసులో కందుల రామిరెడ్డి పేరు హల్చల్
మార్కాపూర్: మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, టీడీపీ సీనియర్ నాయకుడు, నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జిల్లాలోని ప్రజలతో సన్నిహిత సంబంధాలు, పార్టీ కార్యకర్తలు–నాయకులతో అనుబంధం, నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్‌లో అనుభవం, ప్రజా సమస్యలపై స్పందించే తత్వం ఆయనకు ఉన్న బలాలుగా మార్కాపురం నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు, మార్కాపురం ప్రాంత అభివృద్ధి కోసం కందుల రామిరెడ్డి కృషి చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కొత్త జిల్లాకు తొలి జడ్పీ చైర్మన్‌గా అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని పేర్కొంటూ.. కందుల రామిరెడ్డి పేరును అధిష్టానం పరిశీలించాలని కోరుతున్నారు. మరి జడ్పీ పీఠం కోసం అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుంది..? కందుల రామిరెడ్డి పేరు ఖరారవుతుందా..? ఇదే ఇప్పుడు మార్కాపురం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




