Markapur: మార్కాపురంలో గాంధీజీకి జనసేన నేతల ఘన నివాళులు
Markapur: మార్కాపురం జనసేన పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు.
Markapur: మార్కాపురంలో గాంధీజీకి జనసేన నేతల ఘన నివాళులు
మార్కాపురం జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని మార్కాపురం జనసేన పార్టీ కార్యాలయంలో గాంధీజీకి ఘన నివాళులర్పించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యోద్యమంలో మహాత్మా గాంధీజీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సత్యం, అహింసా సిద్ధాంతాలను ప్రపంచానికి చాటిన మహాత్ముడి ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు విజయరావు నరసింహారావు, సిరిగిరి శ్రీనివాసరావు, పిన్నెబోయిన శ్రీనివాసరావు, వీరిశెట్టి శ్రీనివాసులు, మిరియాల వాసవి,మట్టం శ్రీనివాసులు, చాబోలు ఫణి, తదితరులతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




