Markapur: చిరుత సంచార వార్తలపై అటవీశాఖ అధికారుల స్పందన
Markapur: మార్కాపురం భ్రమరాంబ వెంచర్ సమీపంలో చిరుత సంచార ఆనవాళ్లు లభించలేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Markapur: చిరుత సంచార వార్తలపై అటవీశాఖ అధికారుల స్పందన
మార్కాపూర్: మార్కాపురం చెరువు పైభాగంలోని భ్రమరాంబ వెంచర్ సమీపంలో చిరుతపులి కనిపించినట్లు గత రెండు రోజులుగా పశువుల కాపరుల నుంచి సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
సమాచారం మేరకు మార్కాపురం అటవీశాఖ సిబ్బంది ఘటనా ప్రాంతాన్ని పరిశీలించగా చిరుతపులి పాదముద్రలు, ఇతర సంచార ఆనవాళ్లు కనిపించలేదు. ఈ ప్రాంతం ఒంగోలు రేంజ్ పరిధిలోకి రావడంతో అక్కడి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఒంగోలు రేంజ్ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పటికీ చిరుత సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు. సమీపంలోని మరో ప్రాంతంలో శుక్రవారం మరోసారి పరిశీలించి వాస్తవ పరిస్థితిని వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
చిరుత కనిపించిందన్న సమాచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారిక నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేయవద్దని అటవీశాఖ అధికారులు కోరారు.




