Giddalur: వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా షేక్ ఖాజా హుస్సేన్!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన షేక్ ఖాజా హుస్సేన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా పార్టీ అధిష్ఠానం నియమించింది.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 13 Nov 2026 6:35 PM IST
Giddalur
X

Giddalur: వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా షేక్ ఖాజా హుస్సేన్!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన షేక్ ఖాజా హుస్సేన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యత లభించింది. ఆయనను పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి కమిటీల్లో భాగంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలియజేశారు. రాష్ట్ర కమిటీలో సెక్రటరీ హోదా కల్పించడంతో గిద్దలూరు ప్రాంతానికి చెందిన నాయకుడికి పార్టీలో రాష్ట్రస్థాయి బాధ్యత దక్కినట్లయింది. ఈ సందర్భంగా షేక్ ఖాజా హుస్సేన్‌కు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ సోదరులు అభినందనలు తెలియజేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU