Markapur: మార్కాపురంలో హార్టికల్చర్ హబ్ ప్రారంభం: కలెక్టర్ సునీత

Markapur: మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ హబ్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించి, ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 2 Oct 2026 4:17 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో హార్టికల్చర్ హబ్ ప్రారంభం: కలెక్టర్ సునీత

మార్కాపురం: మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి అధికారి బాలాజీ నాయక్, ఉద్యాన, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం, మార్కాపురం జిల్లాల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతులు పండ్లతోటల సాగుపై మరింత దృష్టి సారించి, ఉద్యాన పంటల ద్వారా మెరుగైన ఆదాయం పొందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.

అనంతరం గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రచార రథాన్ని కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని, హార్టికల్చర్ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM