Markapur: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి మరువలేనిది
Markapur: మార్కాపురంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తిని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కొనియాడారు.
Markapur: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి మరువలేనిది
మార్కాపూర్: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1846–47లోనే సాయుధ పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తిని దేశం ఎన్నటికీ మరువదని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. రాయలసీమ వీరత్వం, స్వాభిమానం, త్యాగానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.
ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం బ్రిటిష్ పాలకులను ఎదిరించిన నరసింహారెడ్డి, 1857 సిపాయిల తిరుగుబాటుకు దశాబ్దం ముందే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తొలి తెలుగు వీరుల్లో ఒకరని తెలిపారు. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, ప్రజల కోసం త్యాగం చేసే నిబద్ధత ఆయన జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు.
కర్నూలు విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’గా పేరు పెట్టడం ద్వారా ఆయనకు సముచిత గౌరవం లభించిందని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.




