Markapur: మార్కాపురంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం

Markapur: మార్కాపురం నెహ్రూ బజార్‌లో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించి చీరలు పంపిణీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 Sept 2026 11:15 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం

మార్కాపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్ షిరిడి సాయి ఫంక్షన్ హాల్‌లో అంగన్వాడీ కార్యకర్తలకు ఘనంగా సన్మానం నిర్వహించారు. 25 ఏళ్లుగా అంగన్వాడీ సేవలందిస్తున్న కార్యకర్తలను సత్కరించి చీరలను పంపిణీ చేశారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదా రాజు, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి నాయుడు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి, సీడీపీఓ పద్మతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను సన్మానించడం గర్వకారణమన్నారు.

దేశ సేవ, భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM