Prakasam: టీడీపీ కార్యాలయంలో డిబేటర్ల భేటీ, గంజాం రాఘవేంద్ర హాజరు!

Prakasam: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన డిబేటర్ల సమావేశంలో దర్శి నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర పాల్గొని, కూటమి అభివృద్ధిని గట్టిగా వినిపించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Sept 2026 9:18 AM IST
Prakasam
X

Prakasam: టీడీపీ కార్యాలయంలో డిబేటర్ల భేటీ, గంజాం రాఘవేంద్ర హాజరు!

Prakasam: మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన టీవీ డిబేటర్ ల కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ పరిశీలకులు మరియు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి "గంజాం రాఘవేంద్ర "

ఈ సందర్భంగా డిబేట్స్ లో అనుసరించవలసిన వ్యూహాల గురించి చర్చించడం జరిగింది. ఈ మధ్యకాలంలో గంజాం రాఘవేంద్ర టీవీ డిబేట్స్ లో పాల్గొంటూ కూటమి ప్రభుత్వం చేసిన చేస్తున్నఅభివృద్ధి గురించి చాలా స్పష్టంగామాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మంచి వాగ్దాటి గల వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు

అంతేకాకుండా రాఘవేంద్ర వివాదాలకుదూరంగా ఉంటాడని మంచి భావాలు కలిగిన వ్యక్తి అని గుర్తింపు ఉంది ఇలాంటి వ్యక్తి దర్శి నియోజకవర్గ టిడిపి పరిశీలకులుగా రావడం మనకు మంచి శుభ పరిణామం అని కూటమి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్