Santhanuthalapadu: గురువారెడ్డిపాలెంలో నేడు మండల స్థాయి పీజీఆర్‌ఎస్!

Santhanuthalapadu: ప్రకాశం జిల్లా మండలం గురువారెడ్డిపాలెం సచివాలయంలో సోమవారం మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సురేష్ బాబు తెలిపారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 27 Sept 2026 6:07 PM IST
Santhanuthalapadu
X

Santhanuthalapadu: గురువారెడ్డిపాలెంలో నేడు మండల స్థాయి పీజీఆర్‌ఎస్!

Santhanuthalapadu: సంతనూతలపాడు మండలంలోని గురువారెడ్డి పాలెం గ్రామములోని సచివాలయంలో ఈనెల 28న సోమవారం ఉదయం 10 గంటలకు మండల స్థాయిలో పి. జి. ఆర్. ఎస్. కార్యక్రమం జరగనున్నట్టు ఎంపీడీవో. డి. సురేష్ బాబు తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీల రూపంలో ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

సోమవారం మధ్యాహ్నం నుండి ఆయా అర్జీలకు సంబంధించి ఫీల్డ్ విజిట్ చేసి పరిష్కరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మండలంలోని అధికారులు సిబ్బంది మండల స్థాయిలో జరిగే ఈ పి .జి. ఆర్. ఎస్ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఎంపీడీవో. సురేష్ బాబు కోరారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam