Prakasam: పొదిలిలో విద్యార్థుల కోసం ఉచిత గ్రంథాలయం ప్రారంభం!
Prakasam: ప్రకాశం జిల్లా పొదిలిలో పోటీ పరీక్షల విద్యార్థుల కోసం మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గ్రంథాలయం ప్రారంభమైంది.
Prakasam: పొదిలిలో విద్యార్థుల కోసం ఉచిత గ్రంథాలయం ప్రారంభం!
Prakasam: మానవత స్వచ్ఛంద సేవా సంస్థ పొదిలి శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత గ్రంథాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. మానవత కార్యాలయం పై అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
పొదిలిలో మానవత సంస్థ ఏర్పడిన నాటి నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరణ పొందుతోందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాసర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునేలా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మానవత ఛైర్మన్ కాటూరి పెదబాబు, పుస్తకాల దాత నాసర్, మాజీ జిల్లా అధ్యక్షుడు కాకునూరి యల్లమందారెడ్డి, కన్వీనర్ కల్లం వెంకట సుబ్బారెడ్డి, అధ్యక్షుడు సోమిశెట్టి చిరంజీవి, కార్యదర్శి చిట్టెంశెట్టి వెంకట కృష్ణ, కోశాధికారి అశోక్ బండి, ఉపాధ్యక్షుడు భూమా సుమంత్, కృష్ణ, కరీముల్లా బేగ్, యక్కలి శేషగిరి, శ్రావణి వెంకటేశ్వర్లు, వినోద్ రాజ్, ఎద్దు నగేష్ తదితరులు పాల్గొన్నారు.




