Ongole: మాగుంట రాఘవరెడ్డి రాజకీయ అరంగేట్రంపై ఎంపీ కీలక వ్యాఖ్యలు!
Ongole: ఒంగోలు రాజకీయాల్లో మాగుంట 36 ఏళ్ల వారసత్వం. కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని సరైన సమయంలో రాజకీయంలోకి తీసుకొస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వ్యాఖ్య.
Ongole: మాగుంట రాఘవరెడ్డి రాజకీయ అరంగేట్రంపై ఎంపీ కీలక వ్యాఖ్యలు!
Ongole: ఒంగోలు రాజకీయాల్లో మాగుంట కుటుంబం 36 ఏళ్లుగా కొనసాగుతోందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. మాగుంట అంటే ఒక బ్రాండ్ అని, ప్రజలు తమ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని పేర్కొన్నారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదని, అయితే వయస్సు పెరిగే కొద్దీ గతంలో మాదిరిగా ఉత్సాహంగా పనిచేయడం కష్టమవుతుందని వ్యాఖ్యానించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోసం ఒక టీమ్ను తయారు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మాగుంట వెల్లడించారు. సరైన సమయంలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిపారు. తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు.
మాగుంట కుటుంబ రాజకీయ వారసత్వం, తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.




