Dornala: దోర్నాలలో దగ్ధమైన లారీ.. పెను ప్రమాదం తప్పించిన డ్రైవర్
Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో పశుగ్రాసం లారీ దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగగా, డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.
Dornala: దోర్నాలలో దగ్ధమైన లారీ.. పెను ప్రమాదం తప్పించిన డ్రైవర్
Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో పశుగ్రాసంతో శ్రీశైలానికి వెళ్తున్న లారీ అగ్నికి ఆహుతైంది. నంద్యాల జిల్లా మోదుకూరు గ్రామం నుండి శ్రీశైల దేవస్థానానికి పశుగ్రాసం తీసుకొని వెళ్తున్న లారీ పెద్ద దోర్నాల నటరాజ్ కూడలి వద్దకు చేరుకున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
లారీలో భారీగా పశుగ్రాసం ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అయితే డ్రైవర్ నారాయణ అప్రమత్తంగా వ్యవహరించి లారీని ఊరి మధ్యలో ఆపకుండా బయట ప్రాంతమైన శ్రీశైలం మార్గంలోని ఈదుగా వద్దకు తీసుకెళ్లాడు. దీంతో జనావాస ప్రాంతంలో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమై నష్టం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ చాకచక్యంతో ప్రాణనష్టం తప్పింది.




